ధనాల కోట వనజ చేర్యాల కు చెందిన కళాకారిణి. 30 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఉంటే ఖాదీ కాన్వాస్ పై పురాణ ఇతిహాసాలు కాల పురాణాలు చిత్రించ గలదు. పులివేషాలు, పోతురాజుల మాస్క్ లు తయారు చేయగలదు సహజమైన రంగులను ఉపయోగించి ఆమె వేసే పెయింటింగ్స్ కు ఎంతోమంది అభిమానులు ప్రోత్సహిస్తున్నారు. 2014లో తెలంగాణ హస్తకళ తరపున రాష్ట్ర ప్రభుత్వ అవార్డు తీసుకున్నది. ధనాల కోట వనజ. కాల పురాణ పాఠాలు మాస్క్ బొమ్మల తయారీ అలంకరణ బొమ్మల తయారీ వనజా ప్రత్యేకతలు చేర్యాల బొమ్మలోళ్లుగా పేరుపొందిన వనజ 35 సంవత్సరాలుగా తన కల కొనసాగిస్తూనే ఉంది.