ఒక్కసారి మధుమేహం వచ్చాక తగ్గటం అసాధ్యం అనుకుంటాము కానీ ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం బరువు తగ్గటం వంటి అలవాట్లతో డయాబెటిస్ ముప్పు నుంచి  పూర్తిగా తప్పించుకోవచ్చు అంటున్నారు అధ్యయనకారులు.42 ఏళ్ల వయసులో మధుమేహం వచ్చిన వారిని ఎంపిక చేసి ఆహారం లో వ్యాయామం లో మార్పులు చేశారు క్యాలరీల తో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చారు.రోజుకు పది వేల అడుగులు నడవటం వారానికి 150 నిమిషాల వ్యాయామం చేయించారు సంవత్సరం తర్వాత గమనిస్తే ఒక్కక్కళ్లు 12 కిలోల బరువు తగ్గారు సగం మందికి టాబ్లెట్స్ వేసుకో వలసిన పని లేకుండా మధుమేహం తగ్గిపోయింది ఆహారంతో డయాబెటిస్ ను అదుపు చేయవచ్చు అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment