అవసరాన్ని మించి ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతారుహెల్తీ ప్లేట్ విధానం అనుసరించటం ద్వారా బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.అంటే ప్లేట్ ను నాలుగు భాగాలుగా చూడాలి ఒక భాగం అన్నం,రెండో భాగం పొట్టుతో ఉన్న పప్పులు,మూడో భాగం లో కూరగాయలు ,ఆకు కూరలు నాలుగో భాగంలో పండ్లు తీసుకోవాలి.పండ్లు తీసుకోకపోతే అందులో కూడా కూరగాయలే ఉండాలి.ఈ ఆహారం విధానం అన్ని విధాలా మేలు చేస్తుంది. అన్నం చాలా తక్కువ మోతాదులో 90 గ్రాములు తీసుకోవాలి.దంపుడు లేదా ముడి బియ్యం తీసుకోవాలి.లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ వెరైటీలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి మితాహారం వ్యాయామం తో ఆరోగ్యంగా ఉండవచ్చు.

Leave a comment