మీటు ఉద్యమంలో భాగంగా స్త్రీలపై హింసను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 20వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 22వరకు భారభతీయ మహిళలు డిగ్నిటీ మార్చ్ నిర్వహిస్తున్నారు. మంభైలో మొదలైన ఈ పాదయాత్ర దేశంలోని 24 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా ఢిల్లీకి చేరుతుంది. మొత్తం 200 జిల్లాల మీదుగా సాగుతుందీ మార్చ్ . రాష్ట్రీయ గరిమా అభియాన్ అనే స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ,దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న మూడు వందల చిన్న చిన్న ఎన్జీఓలతో కలిపి నిర్వహిస్తుంది. ఈ డిగ్నిటీ మార్చులో పాల్గొనే మహిళల మధ్య సామాజిక ఆధిక సరిహద్దులు లేవు.లైంగిక వేధింపుల ఆలోచనలు చెరిగిపోయే వరకు పోరాడాలని ఈ డిగ్నిటీ మార్చ్ సంకల్పం.

Leave a comment