జీవితంలో తృప్తి సంతోషం ఎక్కువగా ఎప్పుడూ ఉంటుందీ ? తక్కువగా ఎప్పుడూ అనిపిస్తుందీ అన్న విషయంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి ఒక అధ్యయనం ప్రకారం అభివృద్ధి చెందిన దేశాల్లో సగటున 47.2 ఏళ్ళ వయసులో అసంతృప్తి స్థాయి చాలా ఎక్కువ అని వెల్లడైంది .మనిషి ఎప్పుడూ సంతృప్తిగా బాగుంటాడు అన్న విషయాన్ని వయసుకి ముడి పెట్టి చేసిన అధ్యయనంలో 40 ఏళ్ల తరువాత అసంతృప్తి తీవ్రంగా ఉన్నట్లు తేల్చారు దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక UN REST నెలకొంటుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. 40 ఏళ్ళు వచ్చాక అప్పటివరకూ తెచ్చుకున్న అనుభవంతో జాగ్రత్తలు పాటిస్తూ, ఖరీదైన వస్తువులు కొనకుండా,వాటి వైపు దృష్టి మళ్లకుండా జాగ్రత్త పడుతూ కొత్త వ్యాపకాలు సృష్టించుకోంటారు. అదే వయసులో కుటుంబం, పిల్లలు, ఇంట్లో వయసు దాటిన పెద్దవాళ్ళ బాధ్యతలు, అప్పుడే వయసులో తీర్చుకో వలసిన కోరికలు వీటిని బ్యాలెన్స్ చేసుకోవడం లోనే అసంతృప్తి మొదలవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అప్పటివరకు బాధ్యత భారం మీద పడకుండా నిశ్చింతగా ఉండే వాళ్ళు కొత్తగా పెద్దరికం తెచ్చుకుని జాగ్రత్తగా వ్యవహరించ వలసిన కీలక సమయంలో కి రావటం వల్ల వచ్చే విసుకు కూడా దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే సంతృప్తి, అసంతృప్తి అన్నది ప్రతి మనిషి జీవితంలో తప్పని సహజసిద్ధమైన పరిణామ క్రమంగా అర్థం చేసుకుని సంతోషం పోగొట్టుకోవద్దని పరిశోధకులు సలహా ఇస్తున్నారు .
Categories