
ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక్కళ్ళు హింసకు గురవుతున్నారు హింసను భరిస్తూ మౌనంగా ఉండిపోవడం సబబు కాదు .మీకు తెలిసిన ఎవరైనా హింసకు గురవుతున్నారు అంటే మీ వంతుగా వాళ్లకు ఆసరా ఇవ్వండి సాయం చేయండి ఆపన్న హస్తం అందించండి అంటుంది నటి కీర్తి కుల్హారీ. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు బాలికల పై జరుగుతున్న హింస ను తగ్గించేందుకు ఐరాస్ క్రితం సంవత్సరం హ్యష్ బిల్ట్ బ్యాక్ బెటర్ అండ్ ఈ క్వల్ పేరుతో ఒక ప్రచారాన్ని మొదలు పెట్టింది ఈ ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు తన వంతు సాయం చేస్తోంది కీర్తి కుల్హారీ. పింక్, క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి కుల్హారీ తన నటన కు ప్రశంసలు పొందింది.