కోళ్ళ పందాలు, గుర్రప్పందాలే కాదు ఇంక నవ్వొచ్చే ఎన్నో రకాల పందాలున్నాయి. అసలీ ఐడియా వీళ్ళకు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యం కలిగించే పందాలు కూడా ఉన్నాయి. ఈ విచిత్రమైన పోటీలు ఈ శతాబ్దంలో జరుగుతున్నాయి అంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం జమైకా లో డాంకీ రేసింగ్ జరుగుతోంది. 1994 వ  సంవత్సరం నుంచి ఈ గాడిదల పరుగు పందాలు నిర్వహిస్తున్నారు. ఈ రేసింగ్ లో గాడిదపై కూర్చొని సవరి చేస్తారు నిర్ణీత సమయంలో ఏ గాడిద గమ్యాన్ని చేరుకుంటుందో అదే గెలిచినట్లు. ప్రపంచంలో చాలాచోట్ల వినోదం కోసం ఈ  డాంకీ రేసింగ్ జరుగుతోంది.

Leave a comment