Categories
ఆస్పత్రుల్లో సాధారణ సేవలు కూడా లభించటం కష్టమే .క్లినికల్ లేబొరేటరీ లు కూడా తెరుచుకోవటం లేదు .లాక్ డౌన్ లో షుగర్ , బి పి వంటి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు ఆందోళన పడవద్దు అంటున్నారు డాక్టర్లు .ఇప్పటి వరకు క్రమం తప్పకుండా షుగర్ , బిపి మందులు వాడేవారు ఒకటి రెండు నెలలు పాటు పరీక్షలు చేయించుకో లేకపోయినా అంతగా భయపడవలసిన పని లేదు .సరైన వ్యాయామం లేకపోవడంతో షుగర్ , బిపి స్థాయి పెరిగినట్లు అనిపించినా దాన్ని గురించి ఆలోచించ కుండా వాడుతున్న మందులు కొనసాగించాలి .అవి దొరకని పక్షంలో అదే కంబినేషన్ లో ఉన్న వేరే వీమందులు వాడుకోవచ్చు .నడిచేందుకు అవకాశం లేకపోతే బరువు పెరగ కుండా తక్కువ క్యేలరీలు ఇచ్చే ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోమని సలహా ఇస్తున్నారు డాక్టర్లు .