శారీరక కొవ్వు అదనంగా వుంటే డబుల్ చిన్ ప్రాబ్లం వుంది అనుకుంటారు కానీ డబుల్ చిన్ వచ్చే ఆవకాశం వుంటుంది అంటారు స్పెషాలిస్ట్ లు. ఈ డబుల్ చిన్ కరిగి పోవాలంటే చూయింగ్ గమ్ నమలడమే మార్గం. నిరంతర అలవాటుగాకొన్ని గంటల పాటు చూయింగ్ గమ్ నములుతూ వుంటే చుబుకం లోని ఫ్యాట్ కరగడం ప్రారంభిస్తుంది. షుగర్ ఫ్రీ గమ్ ఎంచుకుని, నోరు వీలైనంత విశాలం గా తెరిచి నాలుక బయటకు పెట్టి, చుబుకాన్ని కిందకి సాగదీస్తూన్నంట్లు పది లెక్కబెట్టె దాకా హోల్డ్ చేయాలి. ఇలా రోజుకు పదిసార్లు చేస్తే అది మంచి వ్యాయామం అవుతుంది. పాలలో గ్లిజరిన్ కలిపి చుబుకం పైన రాస్తే గ్లిజరిన్ సెల్యులైట్ రిమూవర్ గా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా ఈ రెండు చిట్కాలు ట్రయ్ చేస్తూ వుంటే రెండు వారాల్లోనే ఫలితం చూడవచ్చు.
Categories