చాలా చిన్న వయస్సులోనే బాధ్యతలు, చదువు పూర్తి అవ్వగానే ఉద్యోగం యువతలో కనిపించని వత్తిడి లో ఇరవై ఏళ్ళు కుడా రాకుండానే కంటి చుట్టూ వలయాలు సరైన నిద్రలేక కళ్ళ కింద బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. ఇందుకు చక్కని హోమ్ రెమెడీస్ వున్నాయి. వాడేసిన చమో మైల్ లేదా గ్రీన్ బ్యాగ్స్ ఫ్రీజ్ లో పెట్టి చల్లగా అయ్యే దాకా ఉంచాలి. తాజా కీరా ని తురిమి, వెల్లకిల్లా పడుకుని కాళ్ళపైన కీరా తురుము చల్లని గ్రీన్ టీ బ్యాగ్స్ పది నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత కడిగేస్తే నరాలకు మేలు జరుగుతుంది. కళ్ళు తాజాగా అయిపోతాయి. ఇలా కొన్నేళ్ళ పాటు చేస్తే ఫలితం వుంటుంది. అన్నింటికంటే ముఖ్యం సాధ్యామైనంత వరకు, కనీసం పెడు గంటలు నిద్రపోవాలి.

Leave a comment