Categories
సినిమా సక్సెస్ ఫెయిల్ నా పైన ఎలాంటి వత్తిడి తీసుకురాదు నేను బాలీవుడ్ లో పేరుమోసిన కుటుంబం నుంచి రాలేదు కనుక ఇంటిపేరు నిలబెట్టాలన్నా సమస్య కూడా నాకు ఎదురు కాదు . నా పనిని నేను నిజాయితీగా చేసుకొంటూ పోతాను అంటోంది తాప్సీ పన్ను . ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన పాత్రలన్నా చాలా మంచివి . ముఖ్యంగా చెపితే . ఇందులో నేనో సాధారణ మహిళ . అలాగే ఎన్నో మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలన్నీ నాకోసం వస్తున్నాయి . ఆ పాత్రలను నేను సరిగ్గా సరిపోతానని దర్శక నిర్మాతలు భవిస్తూ ఉండవచ్చు . నటిగా నాకు పూర్తి సంతృప్తి ఇచ్చే పాత్రలే చేస్తున్నాను అంటోంది తాప్సీ .