Categories
మార్కెట్లోకి బుట్టబొమ్మ జుంకీలు వచ్చేశాయి వేలాడే ఈ జుంకీలు ఊగుతుంటే నాట్యం చేసినట్లే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక సినిమా లో పాపులర్ అయిన బుట్ట బొమ్మ పాటను స్పూర్తిగా ఫ్యాషన్ డిజైనర్లు ఈ లోలాకులు తీసుకొచ్చారు చెవి దిద్దులు భాగంలో అమ్మాయి బొమ్మ కింద వేలాడే బుట్టబొమ్మలు ఈ జుంకీలు వన్ గ్రామ్ గోల్డ్ తో పాటు వెండి పైన బంగారు పూత పూసినవీ రంగు రంగుల రాళ్లు పొదిగీ వస్తున్నాయి రాళ్ళు పొదిగిన ఈ జుంకీలు తమిళనాడు, కర్ణాటక లతోపాటు అన్ని రాష్ట్రాల్లో ఫ్యాషన్.ఈ ఫ్యాషన్ జుంకీలకు ఇప్పుడు ఎక్కడలేని గిరాకీ.మామూలు బుట్టలే అందంగా ఉంటాయి.ఇప్పుడీ రత్నాలు రాళ్ళు పొదిగిన బుట్ట బొమ్మ జుంకీలు చెవులకు కదులుతూ డాన్స్ చేస్తున్నట్లు కళ్ళను ఆకట్టుకోంటున్నాయి.