Categories
45 సంవత్సరాలు దాటాక పని ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది అంటే అది మోనోపాజ్ కూడా కావచ్చు అంటున్నారు డాక్టర్లు. ఈ దశలో ఇప్పటికే వృత్తిరిత్యా వ్యక్తిగత జీవితంలోనూ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళ అనారోగ్యాలు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు కెరీర్ లో ఎదురయ్యే సమస్యలు వీటన్నిటితో పాటు పని ఒత్తిడి కలుస్తుంది. ఈస్ట్రోజన్ స్థాయి తగ్గి ఆందోళన వంటి భావాలు కలగవచ్చు. ఇలాంటప్పుడే మహిళలకు కుటుంబ సభ్యుల సపోర్ట్ కావాలి. మూడ్ సరిగ్గా ఉండేందుకు వ్యాయామం చేయాలి. యోగా మెడిటేషన్ బాగా పని చేస్తాయి. సోంతంగా ఓ అరగంట టైమ్ కేటాయించుకుని కాస్తా రిలాక్స్ అయ్యేందుకు చూడాలి.