Categories
నోటికి హితవు అనో ,అలవాటుగానో ,పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం వ్యాయమాలు లేక పోవటం చక్కెర వినియోగం మాత్రేమే శరీరపు బరువు పెంచుతున్నాయి. ఆరోగ్య కరంగా ,ఫిట్ నెస్ తో ఉండాలంటే కొర్రతో ,అరికెలు,సాములు ఒక్కో రోజు తింటూ ఉంటేనే ఐదారు నెలల్లో 10నుంచి 25 కిలోల బరువు తగ్గించుకోవచ్చు. వీటితోనే బ్రెక్ ఫాస్ట్ కూడా చేయటం అలవాటు చేసుకోవాలి. ఇడ్లీలు,రోట్టెలు తియ్యని బెల్లం పాయసం కూగా ఈ ధాన్యాలతోనే వండుకోవచ్చు. తాటీ బెల్లం లేదా ఈత బెల్లం వాడుకోవచ్చు. నెమ్మదిగా అయినా సరే రోజుకు రెండు గంటలైన నడవాలి.పాలతో పాటు నువ్వుల లడ్డుతినాలి. పాలల్లో కంటే నువ్వుల్లో పదిరేట్లు కాల్షియం ఉంటుంది.