లో ఫ్యాట్ డైట్,లో కార్బోహైడ్రేట్ డైట్ లేదా అసలు కొవ్వులు లేని డైట్ ఇలా ఎన్ని రకాల డైట్ లు గురించి వింటూ వుంటాం. ఏ పద్ధతి లోనైనా ఎదో కొన్ని పోషకాలు అందకుండా పోతాయి. డైట్ పేరుతొ కొంత బరువు తగ్గిన దీర్ఘ కాలంలో ఊబకాయ సమస్య మొదటికి వస్తుంది. అందుకే ఆ డైట్ ల జోలికి వెళ్ళకుండా ఆహార నియమాలు పాటిస్తూ వేపుళ్ళు,చెక్కర ,బెకెరి ఫుడ్స్, కాఫీ,టీలు బయట ఆహారం వంటివి దాదాపుగా తగ్గిస్తే బరువు నియంత్రణలోకి వస్తుంది. అన్నం రొట్టెల పరిమాణానికి సమానంగా కూర పెరుగు,పప్పు తినాలి. స్నాక్స్ గా పళ్ళు మాత్రమే తినాలి ఆకలి వేస్తే తప్ప ఏమీ తినకూడదు. అరగంట వ్యాయామం,సమయానికి భోజనం,నిద్ర పాటిస్తే ఆరోగ్యకరమైన బరువుతో ఉండచ్చు. కాకపోతే కాస్త సమయం పడతోంది.

Leave a comment