Categories
ఎన్ని కబుర్లు చెప్పిన మనుష్యులను సౌందర్యం పట్ల కాంక్ష తగ్గనే తగ్గదు . అందాల రాణి తెలివి తేటల్లో ఏ పురుషుడికీ తీసిపోని మేటిగా క్లియో పాత్ర చరిత్ర లోకే ప్రసిద్ధం . ఆవిడ సౌందర్యంన్ని కాపాడు కొనే పద్దతుల గురించి ఎప్పటికి గ్లామర్ .ఆ ఆసక్తి తోనే పురాతత్వ శాస్త్రవేత్తలు ,పర్ ఫ్యూమ్ తయారు చేసేవాళ్ళు కలిసి రెండు ఏళ్ళ నాడు అద్భుత సౌందర్యానికి క్లియో పాత్ర వాడిన పరిమళ ద్రవ్యం గురించి పరిశోధనలు చేశాయి . కైరో నగర పరిసరాల్లో ఐదేళ్ళ పాటు ఎంతో వెతికారు . అక్కడ దొరికిన శతాబ్దాల నాటి సెంటుబాటిల్ ఆదారంగా ఆమె వాడిన అత్తరును తిరిగి సృష్టించారు . ఆలివ్ నూనె,యాలకులు,దాల్చిన చెక్క ,సాంబ్రాణి కలిపి ఈ అత్తరు తయారు చేశారు . ఈ పరిమళం చాలా సేపు అలాగే నిలిచి ఉంటుందని చెపుతున్నారు.