ఎండిపోయిన సొరకాయ తో అద్భుతమైన కళాకృతులు చేస్తున్నారు ఆధునికులు. బాగా పెరిగిన సొరకాయ తీగ పైన వదిలేస్తే కొన్ని రోజులకు లోపలున్న గుజ్జు తగ్గిపోయి పైన పెంకుల మారిపోతుంది. ఇలా ఎండిపోయిన సొరకాయను గిరిజనులు పూర్వం నీళ్ల సీసాల్లా ఉపయోగించేవారు. ఈ సొరకాయ బుర్ర తో ఆధునికులు ఎన్నో అద్భుతమైన డిజైన్స్ చెక్కుతున్నారు. పెయింటింగ్, డిజైన్స్ తో పాటు లైటింగ్ ఎఫెక్ట్స్ కోసం రంధ్రాలు చేసి అలంకరణ వస్తువుల్లా తీర్చిదిద్దుతున్నారు. వాటికి ఇపుడు మంచి మార్కెట్ ఉంది.

Leave a comment