Categories
ఎక్కువ రసాయనాలు ఉన్న సబ్బు లు వాడటం ఎండలో తిరగడం సౌందర్య ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వల్ల చర్మంలో మెలనిన్ ఉత్పత్తి పెరిగి నల్లగా అయిపోతుంది. ముఖ చర్మం బాగా ఉండాలంటే సబ్బుకు బదులు మైల్డ్ క్లెన్సర్ వాడాలి. చర్మం తీరుకు తగ్గ మాయిశ్చరైజర్ ఎస్ పి ఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ రాస్తే మొహం నలుపు తగ్గిపోతుంది. అలాగే స్పూన్ తేనెకు అర స్పూన్ నిమ్మరసం కలిపి ప్యాక్ లా వేస్తే ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్క పొడి తేనె కలిపి రాత్రిపూట ముఖానికి రాసుకుని బాగా ఆరిపోయాక కడిగేయాలి. బాదం పొడి పాలు కలిపి కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఎనిమిది గంటల నిద్ర ఉంటే కూడా ముఖ చర్మం మెరిసిపోతుంది.