ఇంటీరియర్స్ లో ముఖ్యమైన చోటునే ఆక్రమిస్తున్నాయి టెర్రికోట వస్తువులు మంచినీటి కూజాల దగ్గర నుంచి లివింగ్ రూముల్లో ఆర్ట్ కాన్వాస్ గా బాల్కనీలో తొట్టిలు గా హంగింగ్ బెల్స్ గా ఇంటి కలనే మార్చేస్తున్నాయి. జల్లెడ లు, జ్యూసర్లు, ప్లేట్లు, ఇడ్లీ పాత్రలు ఇలా ఇంటికి అవసరపడే అన్ని రకాల పాత్రలు మట్టి రూపాలై. ప్రతి షాపింగ్ మాల్ లోను కనిపిస్తున్నాయి. అలాగే మట్టి గణేశుడు ఇంకెన్నో రూపాలకు ప్రేరణ ఇచ్చారు. రాజా, రాణి ఫేస్ మాస్క్ లు వెల్ కమ్ బొమ్మలు గోడలపై దర్శనమిస్తున్నాయి. ఇండోర్ ప్లాంట్ల కోసం టెర్రికోట కుండీలు ఎన్ని రకాల డిజైన్ లలో వస్తున్నాయో లెక్క లేదు ధర తక్కువగా ఇంటి అలంకరణలో మేలైనవిగా నిలుస్తున్నాయి.

Leave a comment