Categories
రక్తంలో చక్కెర నిల్వల్ని నియంత్రిణలో ఉంచేందుకు వ్యాయామాలు తప్పనిసరి. అయితే క్రమం తప్పకుండా 30 నుంచి అరవై నిమిషాలు వాకింగ్ చేయాలి. ప్రస్తుత పరిశోధనలు ఏం చేపుతున్నాయంటే భోజనం తర్వాత 15 నిమిషాల చొప్పున నడవటం ,మొత్తం రోజంతా 45 నిమిషాల చొప్పున నడుస్తుంటే 24 గంటల్లో రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచుకొన్నా ఫలితం ఉంటుందంటున్నాయి. అన్నీ రకాల వ్యాయామాలు గ్లూకోజ్ స్థాయిల్ని మెరుగుపరుస్తాయి. ఒకే సారి పావుగంటో అరగంటో కాకుండా రోజు మొత్తం మ్మీద పావుగంట చొప్పున నాలుగైదు సార్లు నడిస్తే మరింత ప్రయోజనం అంటున్నారు ఇలా నడవటం సుదీర్ఘవాకింగ్ కంటే ఎక్కువ ప్రయోజనం.