శిరోజాలను చూస్తే శరీరం ఆరోగ్యం చెప్పవచ్చు అంటారు. పోషకాలు తీసుకొంటేనే జుట్టు ఆరోగ్యంగా , రాలి పోకుండా ఉంటుంది. ఆహారం ద్వారా తీసుకొనే ఇనుమును ఒంటపట్టేలా చేస్తుంది సి విటమిన్ అలా ఇనుము సరిగా చేరితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.. జుట్టు నిర్జీవంగా కళ లేకుండా ఉందంటే ఐరన్ లోపంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే విటమిన్ ఇ శరీరానికి అందితే జుట్టు ,చర్మం కళగా ఉంటుంది. ఇ విటమిన్ తోనే జుట్టు పొడవుగా పెరుగుతుంది. బాధం గింజల్లో పుష్కలంగా విటమిన్ ఇ దోరుకుతుంది. విటమిన్ ఇ కాప్యూల్ నూ కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టించుకొని ఓ అరగంట తర్వాత కడిగేస్తే జుట్టుకు ఇ విటమిన్ అందుతోంది.

Leave a comment