Categories
లేస్తూనే ఫేస్ బుక్ చూసే వాళ్ళున్నారు . ఒక పర్సనల్ స్పేస్ మిగుల్చుకోకుండా ప్రతి క్షణాన్ని సెల్షీ తీసి పోస్ట్ చేసే వాళ్ళున్నారు. కానీ ఈ వ్యసనం వల్ల చాలా నష్టం అంటున్నాయి అధ్యయనాలు. ఈ మెసేజ్ లు, చాట్ లో రోజు వారీ జీవితాన్ని దూరం చేస్తాయి. ఎంతో సమయం వేస్ట్ అవుతోంది. ఈ అప్ డేట్లు పెట్టేపని కట్టిపెట్టి ఆ సమయాన్ని కుటుంబ సభ్యుల,స్నేహితుల కోసం కేటాయించుకొండి.వారితో సుఖ సంతోషాలు పంచుకోవటం అలవాటు చేసుకోవటం బెస్ట్ . ఏదైన కొత్త పని నేర్చుకోవచ్చు. లేదా చక్కని పుస్తకాలు చదువుకోవచ్చు. వాటిలో జ్ఞానం పెరుగుతోంది. నెలకు ఇన్ని పుస్తకాలు చదవాలని ఓ టార్గెట్ పెట్టుకొని దాన్ని పూర్తి చేసేలా చూసుకొండి అంటున్నారు అధ్యయనకారులు.