లాక్ డౌన్ ముగిసే వరకు సెలూన్లు తెరుచుకోనట్లే మరి జుట్టు పెరిగిపోయి మొహాన  పడిపోయే  పిల్లల మాట  ఏమిటి ?సెలూన్ లో అన్ని రకాల టూల్స్ ఉంటాయి .మరి ఇంట్లో అన్ని ఉండవు గానీ కత్తెర దువ్వెన తో పిల్లలకు చక్కగా హెయిర్ కట్ చేయవచ్చు .చక్కగా బాల్కనీలో పార్కింగ్ ఏరియాలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకొని రెండు పేపర్లు పరచి పిల్లల్ని కూర్చోబెట్టి జుట్టు కత్తిరిస్తే సరిపోతుంది .కటింగ్ సందేహాలు యూట్యూబ్ లో ఫాలో అవుతూ తీర్చుకోవచ్చు.స్టెప్ బై స్టెప్ గైడ్ సూచనలు ఉంటాయి .అంత బాగా రాకపోయినా ఆందోళన అవసరం లేదు కొద్దీ రోజుల్లో ఎలాగూ పెరిగిపోతుంది కదా .అద్దం ముందు చక్కగా కూర్చొని ఎవరికీ వాళ్ళు కూడా చక్కగా హెయిర్ కట్ చేసుకోవచ్చు .

Leave a comment