సలహా ఇవ్వటం చాలా తేలిక పాటించడమే కష్టం గాంధీజీ చెప్పారు అంటున్న ఒక కథ చాలా బావుంటుంది ఒక తల్లి గాంధీజీ దగ్గరకు తన అయిదు ఏళ్ళ పిల్లవాడిని తీసుకు పోయి ,బాపు వీడు అస్తమానం బెల్లం తింటున్నాడు వద్దంటే వినడు మీరు చెపితే తప్పనిసరిగా వింటాడు తినద్దని వీడికి సలహా ఇవ్వండి అని అడిగింది. బాపు వచ్చేవారం చెబుతానన్నాడు తరవాత వారం తల్లి వచ్చింది ఇంకో రెండు వారాల తర్వాత అన్నారు బాపు చివరికి మూడు వారాల తర్వాత బాపు ఆ పిల్ల వాడితో ఎక్కువగా బెల్లం తినవద్దు నాయనా, కడుపులో పురుగులు వస్తాయి అని చెప్పారు. ఈమాట ఎప్పుడో చెప్పవచ్చు కదా బాపు ఇన్ని సార్లు ఎందుకు రమ్మన్నావు అన్నది తల్లి ..నాకు బెల్లం అంటే ఇష్టమే దాన్ని మనుకొనేందుకు నాకు మూడు వారాలు పట్టింది నేను పిల్లవాడికి చెప్పాలనుకుంటే ముందు నేను తినకుండా ఉండాలి కదా అన్నారాయన. అందుకే ఆయన బాపు అయ్యారు అన్నట్లు ఒక అధ్యాయం లో ఒక దురలవాటు పోగొట్టుకోవాలంటే 18 నుంచి 54 రోజులు పడుతుంది. అంటే కాస్త కష్టపడితే దేన్నైనా మార్చుకోవచ్చు కదా!
చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment