రోజులో మూడు పూటలా అధిక మొత్తంలో అన్నమే తినే అలవాటుంటే షుగర్ వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త అంటున్నారు అధ్యయనకారులు. కుటుంబ చరిత్ర,జీవనశైలి,అధిక బరువు పెరిగే వయసు కూడా మూలకారణాలే. ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఈ ఇబ్బంది అధిగమించవచ్చు. అన్నంతో పాటు కొర్రలు,ఊదలు,సజ్జలు,రాగులు,ఆహారంలో చేర్చుకోవాలి. సమతులాహారం తినాలి. వ్యాయామం చేయాలి పోషకాల కూరగాయిలు శక్తి నిచ్చే పప్పులు డైట్ లో ఉండాలి. రాత్రి వేళ చెపాతీలు, జొన్న రొట్టెలు,గోధుమ రవ్వ తో చేసిన ఉప్మా వంటివి కూడా తీసుకోవచ్చు. పీచు,సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉండే తృణ ధాన్యాలను కూడా ఒకపూట భోజనంగా తీసుకొంటూ ఉంటే షుగర్ ముప్పు నుంచి తపించుకోవచ్చు. మనం తీసుకొనే ఆహారం మోతాదును బట్టి మధు మొహం వచ్చే అవకాశాలున్నాయి.

Leave a comment