ఖరీదైన చీరెలను సరిగ్గా భద్రం చేయకపోతే వాటి కళ కాస్త పోయి మన్నిక తగ్గుతుంది.ప్రతిసారి పట్టుచీరెను ఉతక కూడదు  ఒక్కసారి వాడిన తర్వాత గాలిలో ఆరవేయాలి. చీరెలపై మరకలు పడితే చల్ల నీళ్ళతో ఆ మరక పడిన మేరకు శుభ్రం చేయాలి లేదా మరక పడిన చోట కాస్త గ్లిజరిన్ రాయాలి లేదా టాల్కం పౌడర్ తో తుడిచేయాలి. పట్టు చీరెలు ఎక్కువ రోజులు కదలకుండా బీరువాలో ఉంచకూడదు.నెలకోసారి బయటకు తీసి మడతలు మార్చాలి లేకపోతే మడతల్లో చిరుగులు వస్తాయి.అలాగే గాలిలో అరిస్తే దుర్వాసన రాకుండా ఉంటాయి. పట్టుచీరలను కాటన్  లేదా మస్లిన్‌ వస్త్రంలో చుట్టి భద్రపరచాలి.

Leave a comment