Categories
ఎకో ఫెమ్ పాండిచ్చేరిలోని ఆరవిల్లిలో పూర్తిగా మహిళలే మొదలుపెట్టిన ఎకో ప్రెండ్లీ నెలసరి ఉత్పత్తుల సంస్థ . ఇందులో ప్రభుత్వం ధ్రువీకరించిన ఆర్గానిక్ కాటన్‌తోనే తయారు చేస్తారు. ఉపరితలం పల్చని, మెత్తని వస్త్రంతో తయారవుతుంది. అడుగున తడిని పీల్చుకునే మరో మెత్తని వస్త్రం, దాని అడుగున గాలి చొరబడే వీలుండే, పాలీ యురేథీన్ మెటీరియల్‌తో తయారైన పొర ఉంటాయి. పలు రకాల రంగుల్లో తయారయ్యే ఈ న్యాప్కిన్ను ఉతికి వాడుకోవచ్చు. ప్యాడ్ వింగ్స్‌కు ఉండే గుండీల సహాయంతో లోదుస్తుల్లో అమర్చుకునే సౌలభ్యం ఉంటుంది. వాడిన ప్యాడ్‌ను శుభ్రం చేయాలంటే దాన్ని 30 నిమిషాలపాటు చల్లటి నీళ్లలో నానబెట్టి, ఉతికి ఎండలో ఆరబెట్టాలి.