జాతీయ పురస్కారానికి ఎంపికకై నట్లు తెలియగానే ఒక ఏడాదిపాటు నేను పడ్డ కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కింది అనిపించింది. మహానటి సినిమా షూటింగ్ నేను మరిచిపోలేని అనుభవం గంటలకొద్దీ మేకప్ సరిగ్గ చేయలేక పోతే ఉన్నా పేరు పోగొట్టు కొంటానేమో నన్న భయం నన్ను చాలా ఉక్కిరి బిక్కిరి చేసింది అంటోంది కీర్తి సురేష్. మహానటి ఒక అద్భుతం అందరిని కట్టిపడేసే ఒక మాయాజాలం. అలాటి సినిమాలో నటించక ఇంకో బయోపిక్ లో నటించలేను,నటించాను కూడా. చాలా మంది ఇంకో బయోపిక్ లో ఎప్పుడు నటిస్తారు అడుగుతారు. కానీ నేను చెప్పేది ఒకటే ఇది నా మొదటి బయోపిక్,ఆఖరి బయోపిక్ కూడా అలాంటి సినిమాలు భవిష్యత్ లో కూడా చేయను.