తొమ్మిది రోజుల గణపతి నవరాత్రులు అన్ని ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. వసిన్యాది వాగ్దేవతలు శ్రీ విద్యా గణపతిని పూజించి అనుగ్రహం పొందండి అని చరిత్ర చెబుతోంది. శ్రీ లలితా సహస్ర నామము నడిస్తే మనకు దర్శనం ఇస్తారు.రాక్షసుల బారినుండి తమను రక్షించడానికి అమ్మ యుద్ధానికి వెళితే ఆ సమయంలో 8 దుష్ట శక్తులు శ్రీ చక్రం లో పడేశారు అసురులు.అవి:సోమరితనం,అలక,బేలతనం,నిద్ర, కిరాతకం, వెనకడుగు వెయ్యడం,కోపం,హింసించడం.ఈ 8 దుష్ట శక్తులును అధిగమించి విజయాన్ని సాధించాలి అంటే మరి శ్రీ విద్యా గణపతి నిత్య మరి పూజిద్దామా!!

నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు,ఉడికించిన శనగలు.

-తోలేటి వెంకట శిరీష.

Leave a comment