Categories
Nemalika

ఇది అంతులేనంత సీరియస్ సమస్య.

నీహారికా,

రెండు చిత్రమైన ఒకదానికొకటి పొంతనలేని రిపోర్ట్స్ వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అంచనా ప్రకారం భారతీయులలో 17 శాతం మందికి పోషకాహార లోపం ఉంది. ప్రపంచంలోని పోషకాహార లోప జనాభాలో మూడో వంతు భారతీయులే. అలాగే మనదేశంలో జరుగుతున్న ఆహార పదార్ధాల వృధా ఇంకెక్కడా లేదు. ఇంగ్లాండ్ దేశ ప్రజలంతా తినే ఆహారంలో సమానంగా ఉందీ వృధా. ఆరు కోట్ల మంది ఆహరం దొరక్క అలమటించి పోతుంటే పదార్ధాల వృధా పైన నియంత్రణే లేదు. హోటళ్ళలో, వివాహ శుభకార్యాలలో జరుగుతున్న వృధాకి అంతులేదు. హోటళ్ళలో అధికంగా సర్వ్ చేస్తారు అలాగే అధికంగా బిల్ వేస్తారు. భారత దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆహార పదార్ధాలలో దాదాపు 40శాతం వృధా అవుతున్నట్లు అంతర్జాతీయ సంస్థ అంచనా. దాని విలువ 50కోట్ల రూపాయలని లెక్కలు తేల్చారు. దీన్ని అరికట్టడం ప్రభుత్వం ఒక్క దాని భాధ్యతే కానే కాదు. సమిష్టిగా ప్రజలు దీన్ని ఒక సమస్యగా తీసుకుని అరికట్టాలి. ఒక వైపు ఉత్పత్తి లో గణనీయమైన ప్రగతి సాధిస్తే వృధా దానికి మించి ఉంది. అలాగే అధిక పోషక పదార్ధాల సమస్య, భారీ సమస్య అయితే అంటే శారీరక వ్యాయామం కరువై ఓవర్ న్యూట్రిషన్ సమస్యన్నమాట, పోషకాహారలోపంతో బాధపడుతున్న పిల్లలు కింది స్థాయిలో అధికంగా ఉన్నారు. బెంగళూరులో ఒక సర్వేలో ఆరు నెలల పెళ్ళిళ్ళ సీజన్ లో 943 టన్నుల నాణ్యమైన వంటకాలు వృధాగా పారేశారని తేలింది. ఇది ఎంత సీరియస్ గా ఆలోచించాలి చెప్పండి.

Leave a comment