Categories
ఇది ఆడవాళ్ళ గ్రామం అందులోను భర్త చనిపోయిన ఒంటరి మహిళలు నివశించే గ్రామం. ఈ ఊర్లోకి మగవాళ్ళ ప్రవేశం లేదు. ఇది సిరియాలోని జిన్ వార్ గ్రామం సిరియా అంటేనే అంతర్గత యుద్ధాలకు పేరు పడింది. ఆయా యుద్దాల్లో అమరులైన సైనికుల భార్యలు కోసం నిర్మించారు ఈ గ్రామాన్ని. స్కూల్ ఆరోగ్య కేంద్రం వంటి సౌకర్యాలున్నాయి గ్రామంలో నివశించే మహిళలు వ్యవసాయం,పశువుల పెంపకం పై ఆధార పడతారు. మగవాళ్ళకు ఈ గ్రామంలోకి అనుమతి లేదు రక్షణ గా మహిళలే తుపాకి ధరించి గ్రామ ముఖద్వారం దగ్గర కాపలా కాస్తారు. గ్రామంలో అందరూ ఒకేచోట ఉదయపు పలహారం,రాత్రిభోజనం వండుకొని అందరు అక్కడే భోజనం చేస్తారు.