ఎన్నో డిజైనర్ డ్రెస్సులకు లేస్ ఏటాచ్ చేస్తుంటారు. డ్రెస్ పని అయిపోయినా లేస్ చేక్కుచెదరకుండా వుంటుంది. దాన్ని అలా పారేయకుండా. ఇంటి అలంకరణ కోసం ఉపయోగించింది అని చేఅపుతున్నారు. ఇంటీరియర్ డెకరేటర్లు. పాత కుండీలకు చెక్కగా రంగులు వేసి వాటి చుట్టూ జిగురుతో ఈ లేస్ అంటించి మద్య మధ్యలో కుందన్ రాళ్ళు అతికించి అందులో ఆర్టిఫిషియల్ డెకొరేషన్ కోసం పెట్టే పువ్వులు, ఆకులూ పెట్టొచ్చు. దీన్ని కదలకుండా హాల్లో ఉంచుతాం కాబట్టి ఈ కుండీ మురికిగా అయ్యే ప్రమాదం లేదు. అచ్చం నిజమైన పువ్వుల్లా వుండే చైనా మేడ్ ఫ్లవర్స్ కు మార్కెట్ లో కొదవ లేదు అలాగే డిజైనర్ కొవ్వొత్తుల స్టాండ్ తాయారు చేయొచ్చు. పాతవైపోయిన డ్రేస్సుల నుంచి సేకరించిన లేస్ లు, అంచులు, గాజు పాత్రని చక్కగా అలంకరించి అందులో కొన్యుత్తులని పెట్టి టేబుల్ పైన పెట్టుకోవచ్చు. కొన్ని పనులు మొదలు పెడితే ఇంకా ఇలాంటి మిగిలి పోయిన అంచులు, లేసులు, రంగురాళ్ళు కుందనాలతో ఎలాంటివి అలంకరించ వచ్చో తెలుస్తుంది.

Leave a comment