పిల్లల్ని మట్టిలో వేళ్ళు పెడితే కోప్పడుతూ ఉంటాం . కానీ ఏ కార్టూన్ నెట్వర్క్ చూస్తూ టీవీ ముందర గడిపేకన్నా వాళ్ల్లు మట్టిలో ఇసుకతో ప్రకృతి మధ్య ఆడుకుంటూ గడిపితే మంచిదంటున్నారు ఎక్స్ పెర్ట్స్ . మనం చెప్పలేని ఎన్నో పాఠాలు ప్రకృతి నేర్పిస్తుంది . ప్లాస్టిక్ కప్పుల్లో మట్టిపోసి మెంతులు ఆవాలు వంటి మొక్కలు ఎలా పెరుగుతాయో గమనించవచ్చు. ఇసుక మట్టితో ఆదుకునేలా ఇంటి ముందు కాస్త దిబ్బలా ఏర్పాటుచేసి చిన్న చిన్న బొమ్మలేస్తే వాళ్ళ క్రేయేటివిటీ చూపించేస్తారు. ఒక బ్లాక్ బోర్డు సుద్ద ముక్కలు ఇస్తే ఇక ఆర్టిస్ట్ లు అయిపోయేంత పని చేస్తారు. వాళ్ళు ఎదో ఒక విద్య నేర్చుకునే దిశగా ప్రోత్సహించటం పెద్దవాళ్లుగా మన బాధ్యత. నలుగురి పిల్లలతో ఆడుతూ ఉంటే భావ బ్యాక్తీకరణకు మాట్లాడేందుకు అవకాశం వస్తుంది. నలుగురితో కలిసి మెలిసి వుండటం అలవాటవుతోంది.