కొందరిని చూడగానే చప్పున ఆకర్షిస్తారు. వాళ్ళ నవ్యా, డ్రెస్ సెన్సో, లేదా బాడీ లాంగ్వేజో, ఎదో ఒక విషయం మ్యాజిక్ చేస్తుంది. అలా మొదటి చూపులోనే వాళ్ళతో స్నేహం చేస్తాం. అదిగో ఆ తోలి ఏడు క్షణాలే కీలకం, ఆ క్షణంలో మనకు ఎదుటి వాళ్ళు అర్దమైపోతారు. మనం కూడా ఎదుటి వాళ్ళకు అంతే కదా. అందుకే ఎక్స్ పర్ట్స్ ఏం చేపుతారంటే, మన వస్త్ర ధారణ, నువ్వు వేసుకునే నగలూ, నిలబడే విధానం ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని ప్రతి ఫలిస్తాయట. అందుకే తెచ్చి పెట్టుకున్న నవ్వు నవ్వొద్దు. వీలైనంత వరకు హాయిగా నవ్వాలి. నవ్వమంటే కనుబొమ్మలు పైకి లేచేంత బాగా నవ్వాలి. అలాగే ఎదుటి వాళ్ళ కళ్ళల్లోకి లోతుగా చూడాలట. స్వచ్చంగా మన మనస్సు తెలియజెప్పెంత ప్రేమగా చూడాలి. అప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని నిజాయితీ పరులుగా, సమర్ధులుగా, ఆకర్షనీయమైన, వ్యక్తులుగా పరిగణిస్తారు.బావుంటుంది కదా. సంతోషంగా మనస్పూర్తిగా నవ్వడం మనకి బాగానే వుంటుంది కదా.
Categories