హాయిగా నవ్వడం ఒక అద్భుతమైన వరం. ఇళ్ళలో అస్తమానం నవ్వటం తప్పని చెపుతారు కానీ ఎప్పుడు ఎలా నవ్వొచ్చో మాత్రం నేర్పారు. కొందరు పిల్లలు అందుకే కదిలిస్తే కారుస్తామన్నట్లుంటారు. అలా వుంటే పిల్లాలతోనే కాదు పెద్ద వాళ్ళతో కూడా ఎవ్వళ్ళు మాట్లాడరు. నవ్వటం, నవ్వించటం చేతగాక పోతేనే వంటరితనం వస్తుంది. అందుకే నవ్వటం కూడా ఒక కళే అనుకుని దాన్ని సాధన చేయాలి. నవ్వు ఒక్కటే కష్టాల్ని, జీవితంలో ఎదురయ్యే అంతరాలని ఎదుర్కునే శక్తినిస్తుంది. మూడ్ మార్చుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. మనిషి కొచ్చే 60శాతం అనారోగ్యాలు నవ్వు అనే టానిక్ తోనే దూరం అవుతాయంటారు. ఉచితంగా లభించే ఈ టానిక్ ని ఉపయోగిన్చుకోక పొతే ఎట్లా మనసుని ఉల్లాసంగా వుంచుకో గాలిగితే శరీరంలో ఏర్పడిన ప్రిరాడికల్స్ ని నియంత్రించే హార్మోన్స్ తయారవుతాయి. మంచి జోక్స్ పుస్తకాలు చదవాలి. హాస్యం నిండిన సినిమాలు చూడాలి. ఎలాగోలా నవ్వుని జీవితంలోకి ఆహ్వానించగలగాలి.
Categories