Categories
భారత దేశపు తొలి ఎఐ మామ్ ఇన్ఫ్లుయెన్సర్ కావ్య మెహ్రా మాతృత్వం లోని వాస్తవికత, ఆధునిక సంకేతికత కలుపుకొని సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ అమ్మను సృష్టించింది కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్ వర్క్.ఈమే వ్యక్తిత్వాన్ని నిజమైన తల్లుల అనుభవాల నుంచే తీసుకున్నారు. కావ్య మెహ్రా పోస్ట్ లో మాతృత్వానికి సంబంధించిన అంశాలే ఉంటాయి. గర్భిణిగా ఉన్నప్పటి నుంచి కాబోయే తల్లిగా తన భావోద్వేగాలను విస్తరిస్తోంది ఎఐ అమ్మ.. పాపాయి సంరక్షణ,స్వీయ సంరక్షణతో పాటు వంటకాలు తయారీ గురించి కూడా చెబుతూ మల్టీ టాస్కింగ్ చేస్తోంది. ఈ వర్చువల్ మామ్ ఆధునిక తల్లుల మనోభావాలకు అద్దం పట్టేలా ఉంది.