Categories

పుల్లగా, తీయగా, అందమైన ఎర్రని రంగులో వుండే ప్లమ్ పండ్లు అన్ని కాలాల్లోను వీటిని ఆల్బుభారీ అని పిలుస్తారు. అవి పెద్దగా పట్టించుకోము కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో వుండే విటమిన్-కె, ప్లేవనాయిడ్లు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. బాగా అలసిపోయి నీరసంగా వుంటే ఐడు పండ్లు తింటే చాలు వెంటనే శక్తిని పుంజుకోవచ్చు. నీరసించి బిగదీసుకు పోయిన కందరాళ్ళు తిరిగి యధా స్ధితికి రావడంలో అప్పటి వరకు వున్నా వత్తిడి తగ్గిపోతుంది. ఇవి జీర్ణ వ్యవస్థకు కుడా ఎంతో మేలు చేస్తాయి. జీవక్రియ వేగాన్ని పెంచుతాయి. పీచు ఎక్కువ. వీటిల్లోని విటమిన్-సి చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది.