Categories
పాపిటలో అందమైన నెమలి కన్ను మరింత అందంగా ఓడిగిపోతే….. నల్లని సిరోజాల్లో పాపిటలో నెమలి కన్ను….. ఇది ఇవ్వాల్టి జుట్టు, అలంకరణలో కొత్త ట్రెండ్. జడ పెద్దయిన, బుల్లిదైన, కాపుగా పెట్టిన అలా వదిలేసినా, జుట్టు మాత్రం నున్నగా దువ్వేసి చెరగకుండా చేసి మధ్యలో గ్లిట్టర్స్ అంటే మెరిసే చమ్మీలు వేసుకోవడం ఫ్యాషన్. పాపిట మధ్యలో అన్ని రకాల చమ్మీలు వేసుకుంటున్నా అన్నింటికన్నా నెమలికంఠం రంగునే ఎక్కువగా ఇష్టపడుతున్నారు అమ్మాయిలు. ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసిన మెరుపుల్లో నెమలి కన్ను రంగుకే ఫుల్ మార్క్స్.