Categories

పళ్ళు తినండి బావుంటారు అని చెప్పుతున్నారు కదా, కానీ ఓ రెండు రకాల పళ్ళు ప్రతి రోజు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం మెలనోమా అనే చర్మ కాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. సుమారు లక్షమంది స్త్రీ పురుషుల పైన సుదీర్ఘ కాలం జరిగిన ఈ పరిశోధనలో, కొందరికి ఈ పండ్లు నేరుగాను, కొంతమంది జ్యూసు ల రూపంలో ఇచ్చారు. అతిగా తీసుకున్న వారిలో మెలనోవా కాన్సర్ లక్షణాలు చూశారు. అయితే ఈ విషయంలో ఇంకా నిర్ధారణకు రావాల్సి వుంది కానీ పరిశోధనా ఫిలితం మాత్రం ఏ పండ్లు ఏ ఆహారం అయినా అతిగా వద్దు అనే చెప్పుతుంది.