అందరు మీటూ గురించి మాట్లాడుతుంటే అనుపమ పరమేశ్వరన్ చిత్రసీమ పోకడలు అక్కడ రక్షణ గురించి చాలా పాజిటివ్ గా చెబుతుంది. ఈ పరిశ్రమలోకి అడుగుపెడితేనే ఈ రంగం గురించి క్షున్నంగా తెలుస్తుంది. దూరం నుంచి చూసి ఒక అభిప్రాయానికి రావడం మంచిది కాదంటుంది. ఎవరి హద్దులో వాళ్ళు ఉంటే సమస్యలు ఎందుకు వస్తాయి.అనేక దశాబ్దాలుగా ఎంతో మంది తారలు వెండితెర వేల్పులుగా వెలిగారు. వస్తున్నారు వెళ్లిపోతున్నారు అంటే ఈ క్రమం చూస్తుంటే ఇక్కడేమి సమస్యలు ఉన్నట్లు నాకు అనిపించడంలేదు అంటుంది. చిత్రపరిశ్రమ తనకు ఇచ్చిన ప్రోత్సాహం ప్రేక్షకుల అభిమానం తనకు మరవలేనివి అంటుంది అనుపమ.