Categories
ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉంటే బరువు తగ్గటంతో పాటు చర్మం కూడా చక్కగా ఉంటుందంటారు ఎక్స్ పర్ట్స్. ఉదయం అల్పాహారంలో పాలకూరతో చేసిన ఆమ్లెట్ ,వివిధ రకాల కూరముక్కలతో చేసే కిచిడి వంటివి ఉండాలి. తినే ఆహారంలో 70 శాతం కూరగాయలే ఉండాలంటారు. పండ్లు ,కూరగాయలు ,గింజలు బీన్స్ మొదలైనవి కలగలిపి తయారు చేస్తే ఆ ఆహారం తేలికగా ఆరోగ్యంగా వంతంగా ఉంటుంది. రంగుల్లో ఉండే కూరగాయల్లో పండ్లలో పోషకాలు అందుతాయి. ఏ కాలంలో వచ్చే కూరగాయలు ,పండ్లు ఆకాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది ప్రకృతి చెప్పే ఆరోగ్యం కూడా కూరగాయల సలాడ్ కూడా ఇష్టంగా తిని తీరాలి. వాటితో చేసే జ్యూస్ లు అలవాటు చేసుకోవాలి. నోటికి ఇంపుగా ఉండేవి ఆరోగ్యం ఇస్తాయని రూలేం లేదు.