Categories
ఇంట్లోనే పన్నీరు తయారు చేసుకోవాలంటే రెండు కప్పుల గులాబి రెక్కలు ఒక లీటర్ నీటిలో వేసి మరిగించి చల్లార్చితే సరి. పన్నీరు తయారీకి వర్షపు నీరు మంచిది, కూరల్లో రుచి పెరగాలంటే చివరలో ఒక స్పూన్ కొబ్బరి తరుము అర స్పూన్ జీలకర్ర పొడి కలపాలి. టోమాటో పేస్ట్ ఇంట్లో తయారు చేసుకొని కూరల్లో వాడాక మిగిలిపోతే పారేస్తూ ఉంటారు. దీన్ని ఐస్ ట్రేలో కొంచెం ఉప్పు కలిపి నాలుగైదు రోజుల వరకు పాడై పోకుండా ఉంటుంది. దూది ఉండను ఆరోమా ఆయిల్ లో ముంచి గది షెల్ఫ్ ల్లో మూలన ఉంచితే ఇల్లంతా సుగంధ పరిమళం వ్యాపిస్తుంది.