సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రించింది తెలుగు కథానిక .వందేళ్ళ పైబడి సుదీర్ఘ ప్రయాణం చేసిన సాహిత్య రూపాల్లో నాలుగు తరాల రచయితలు తమ అనుభావాలు ఆశయాలు పాఠకులకు పంచారు. వాస్తవిక జీవితాన్ని పునాదిగా తీసుకొని క్లుప్తంగా ,ఒక జీవభాషలో కథాసాహిత్యం అత్యంత ప్రభావ వంతంగా పాఠకుల మనసు దోచుకొంది. తెలంగాణ జన జీవితాన్ని వేదికగా తీసుకొని బెల్లంకొండ చంద్ర మేళా శాస్త్రి గారు 1946-61 మధ్యకాలంలో అలనాటి స్వాతంత్ర్యోద్యమాన్ని మధ్య తరగతి జీవితాలను వాళ్ళలోని భేషజాలను ,అహంకారాలను,భిన్న మనస్థత్వాలని అత్యంత సహజంగా కథల్లో చిత్రికరించారు ఈ కథా సంపుటిలో 11 కథలున్నాయి. ఈ కథలు చరిత్ర పుటల్లో జారిపోయిన ఒక ఇరవై సంవత్సరాల గతానికి దర్పణం..ఈ సంపుటిలో కథలన్ని ఆనాటి పత్రికల్లో ప్రచురణమైనవి. వెల 40 రూపాయలు , ప్రతులకు తెలంగాణ సాహిత్య అకాడమి కళా భారతి ,రవీంద్ర భారతి ప్రాంగణం..ఫోన్ నెంబర్:040- 29703132..

Leave a comment