పారశీ భాషలో ఉమర్ ఖయం రాసిన రుబాయీలను శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు తెలుగులోకి అనువాదం చేశారు.ఖయం ఈ రుబాయీల్లో సూరఫీ సిద్దాంతాన్ని మార్శిక భాషలో రాశారు. భక్తుడు పరవశంతో భగవంతున్ని కీర్తించిన విధానం ఇది. ఖయ్యం గొప్ప అభ్యుదాయ వాది కూడా .ముల్లాల నిరంకుశత్వాన్ని దౌర్జన్యాన్ని ఖండించాడు,అలాగే సూఫీ మత తత్వాన్ని అర్థం చేసుకొని ఒక ఆధ్యాత్మిక లోకాన్ని రుబాయీల ద్వారానే లోకానికి చూపించాడు. ఒక నాటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కీర్తీ శేషులు బూర్గుల రామకృష్ణా రావుగారు ఈ రుబాయీలను పారశీ భాషలో నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. వచనానికి అలవాటు పడిన ఎంతో కాలం తరువాత పద్యాల రూపంలో ఉన్న ఈ రుబాయీలు ప్రచురించింది తెలంగాణ సాహిత్య అకాడమీ .ఈ ఆంధ్ర పద్యానువాదాన్ని పాఠకులకు కానుక గా ఇచ్చారు. వివరాలకు ఫోన్ నెంబర్:040-29703142..

Leave a comment