Categories
మొలకెత్తిన గింజల్లో మంచి పోషకాలున్నాయి. వాటిలో క్యాలరీలు తక్కువ బరువును నియంత్రించ గలుగుతాయి గింజలు మొలకెత్తే ప్రక్రియలో పోషక పదార్దాలు కొంత వరకు మారిపోతాయి మొలకెత్తిన గింజలో ప్రోటీన్లు అమైనో యాసిడ్స్ ఎక్కువే ఐరన్,ఫోలిక్,మెగ్నీషియం,ఫస్పార్స్,మాంగనీస్,విటమిన్-సి,విటమిన్-కె కూడా మొలకెత్తిన గింజల్లో ఎక్కువే రోజు మొలకెత్తిన గింజల్ని తింటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అయితే మొలకెత్తిన గింజల్ని ఫ్రిజ్ లో వుంచాలి కాస్త జిగురు వచ్చిన రంగు మారిన వాసన అనిపించినా తినద్దు. అవే ఈ మొలకెత్తిన గింజల్ని ఉడికించి తింటే వాటిలోని పోషక విలువలు కాస్త తగ్గుతాయి కానీ బాక్టీరియా పూర్తిగా పోతుంది. గింజల్నిఉడికించిన పచ్చిగా తిన్న వాటిలో శక్తి ఎక్కువే.