నీహారికా ,

చాలామందికి పర్ఫెక్షన్ అంటే గట్టి పట్టుదల. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని తపిస్తారు. ఆ కొందరికే కాదు ఎవ్వరైనా ఏ పనైనా పర్ఫెక్ట్ గా పూర్తి చేయక పొతే మిగతా పనులు మూల పడిపోతాయి. క్రమశిక్షణ తో దాన్ని సాధించవచ్చు. పుస్తకాలు బుక్స్ , యాక్ససరీస్ దుస్తులు ఇవన్నీ ఒక పద్దతిగా ఏది కావాలి అంటే అది చేతికందే విధం గా ముందు పనులు మొదలు పెట్టాలి. ముందర మన పని మనం టైమ్ ప్రకారం చేసుకోగలుగుతాము. తర్వాత ఎప్పుడూ జ్ఞాపక శక్తి నే నమ్ముకుని కూర్చోకూడదు. ఫోన్ నెంబర్లు అడ్రస్సులు నోట్ చేసుకోవాలి. ప్రతీదీ కంప్యుటర్ లోకి ఎక్కించాలి. అలాగే చేయదలుచుకున్న ప్రతీ పనీ చేసిన ఫోన్లు మాట్లాడుకున్న విషయాలు అన్నీ నోట్ చేసి పెట్టుకోవాలి. ఆ డైరీ చేతికి అందుబాటు లో ఉండాలి. ముఖ్యమైన విషయం దేన్నీ అయినా సగం లో వదిలేయ కూడదు. అలాగే ఊగిసలాట చాలా ప్రమాదం. ఈ పని చేయాలా వద్దా , అదా ఇదా అన్న ఆలోచన వద్దు. కీలకమైన నిర్ణయం బాగా అలోచించి తీసుకోవాలి. అంతే ఇలా కొన్ని పద్ధతుల్లో నడిస్తే ప్రతివాళ్ళు పర్ఫెక్టే మరి.

Leave a comment