Categories
ఇక వర్షాలు మొదలయ్యాయి . ఇళ్ళల్లో ఆఫీసుల్లో ఎండపడక వాసన వస్తూ ఉంటుంది . రూమ్ ఫ్రెషనర్ కంటే ఆరోమా నూనెలు వాడి చూడమంటారు ఎక్స్ పర్డ్స్ . అరోమా నూనెల్లో యాంటీ బాక్టరియల్ ,యాంటి ఫంగల్ లక్షణాలు ఉంటాయి . ఒక గిన్నెలో నీళ్ళుపోసి మరిగించి ఆ మరిగే నీళ్ళు నిమ్మనూనె గానే యూకలిఫ్టస్ నూనెగాని వేస్తే ఇల్లంతా పరిమళం వస్తుంది . కమలా పూవులు ను లవంగాల గుచ్చి ఎండబెట్టి వాటిని వంటింటి మూలల్లో ఉంచితే వాసనలు పీల్చేస్తాయి . సాదరణం గా ఇళ్ళలో పూజకో ,అలంకరణకు పూలు కొంటారు . వాటిని ఎండనిచ్చి ఒకపాత్రలో వేసి కాస్త అరోమా నూనె కలిపితే చాలు ఇల్లంతా సుగంధమే .