పారిశ్రామిక ఉత్పత్తులు, ఫోటోగ్రఫీ, నగలు, పాత్రలు కంప్యూటర్ కీ బోర్డులు, మైక్రో వేవ్ కంట్రోల్ ఫ్యానెల్స్ లో వెండి తప్పని సరి భాగం .ఎప్పటికీ వెండి వస్తువులు కానుకగా ఇచ్చే సంప్రదాయం పచ్చగానే ఉంది. అన్నీ జ్యూవెలరీ సంస్థలు వెండి వస్తువులు తయారు చేస్తున్నాయి. వెండికి బాక్టీరియా ,వైరస్ లను దరి చేరనివ్వని లక్షణం ఉంది. ఆక్సిజన్ తాకిడి రంగు మారుతుంది కానీ తుప్పుపట్టదు. ఆహారపదార్థాలు నిల్వవుంచినా ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం రాదు. ఇప్పుడు గృహాలంకరణల్లో వాడే వెండిలో 92.5 శాతం ,వెండి 7.5 శాతం కాపర్ కలిపి వస్తువులు తయారు చేస్తారు. క్యాండిల్ హల్టర్స్ ,కిచెన్ లో ,డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకొనే వస్తువులు తెల్లని మెరుపులతో కనువిందు చేస్తాయి.