ఈ ఎంబ్రాయిడరీ పోర్ట్రెయిట్స్ చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ చిత్రాలను ఎవరైనా అదాటున చూస్తే ఒక మంచి ఆర్టిస్ట్ శ్రద్ధగా వేశారు అనుకునేలా ఉంటాయి. కానీ అవన్నీ రంగు దారాలతో కుట్టినవి అని తెలియగానే ఆశ్చర్య పోయి తీరుతారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన అస్మితా పోత్దార్ అనే ఆర్టిస్ట్ సూది రంగు దారాలతో రూపొందించిన చిత్రాలు ఇవి. చిన్నప్పుడు తల్లి దగ్గర ఎంబ్రాయిడరీ నేర్చుకున్నది దాన్ని కళగా మార్చుకుని ఇలా దారపు పోగులతో అందమైన చిత్రాలకు ప్రాణం పోస్తోంది. కాన్వాస్ పైన బొమ్మలు గీసుకొని ఆ తర్వాత కళ్ళు ముక్కు దుస్తులు ఇవన్నీ నిజమైన వాటిలా కనిపించేలా ఆకారం వచ్చేలా రంగు దారాలతో నెమ్మదిగా కుడుతుంది. అచ్చం ఫోటో లాగా కనిపించే చిత్రాలను రంగు దారాలతో నేర్పుగా కుట్టటం గొప్ప విషయమే అస్మితా పోత్దార్ నిస్సందేహంగా గొప్ప ఆర్టిస్ట్.
Categories