ఎంత అందమైన బ్యాగ్ క్యారీ చేస్తున్నా అందులో చిన్న ఎమర్జెన్సీ పర్స్ తప్పని సరిగా ఉంచుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ .ఈ పర్స్ లో అత్యవసరమైననే ఉండాలి. ఒక్క సారి అనుకోకుండా ముందుగా నెలసరి రావచ్చు. అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా రెండు శానిటరీ నాప్ కీన్లు ఇందులో ఉండాలి. అలాటే ఏ ఆఫీస్ నుంచో అనుకోకుండా ఇంకెక్కడికి వెళ్ళవలసి ఉంటుంది.ఉదయం నుంచి పనిలో అలిసి పోయినా ముఖం తాజాగా మర్చుకొవాలంటే చిన్న షేస్ వాష్ ఉండాలి.అలాగే మాయిశ్చరైజర్,చక్కని దువ్వెనా కూడా ఉండాలి. ముఖం జిడ్డు వదిలించుకొనేందుకుకొన్ని టిషకయే పేపర్లు ,రబ్బరు బ్యాండ్లు ,కిప్పులు ఒక రెండు ఉంచుకోవాలి. హాడావుడిగా వెళుతుంటే బండి సీట్స్ కు తగిలి వేసుకొన్న డ్రెస్ కాస్త చిరిగచ్చు. కొన్ని సెఫ్టీ పిన్స్ ఉంటే మంచిదే కదా. అలాగే కాస్త డబ్బు చిల్లరా ఉంచుకోంటే ఇది అదనపు అవసరాలను తీరుస్తాయి.

Leave a comment